హిందీలో ‘మహావతార్ నరసింహ’ సాలిడ్ రన్.. లేటెస్ట్ వసూళ్లు!

హిందీలో ‘మహావతార్ నరసింహ’ సాలిడ్ రన్.. లేటెస్ట్ వసూళ్లు!

Published on Aug 9, 2025 11:07 AM IST

mahavatar narasimha

ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సంచలనం మహావతార్ నరసింహ. కేవలం ఆ దేవదేవుల్లే ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన కంప్లీట్ యానిమేషన్ సినిమా ఇది కాగా భారీ వసూళ్లు వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో మహావతార్ నరసింహ సంచలన వసూళ్లు కొనసాగిస్తోంది.

నిన్న శుక్రవారం వసూళ్లు అయితే రెండో బుధవారం, గురువారం కంటే ఎక్కువ నమోదు అయ్యాయట. దీనితో భారీ వసూళ్లు ఈ సినిమాకి కొనసాగుతున్నాయి. నిన్న శుక్రవారం 4.7 కోట్ల నెట్ మార్క్ తో మొత్తం 89 కోట్ల నెట్ వసూళ్లు కేవలం హిందీ వెర్షన్ లో అందుకుంది. ఇక వీకెండ్ శని, ఆదివారం వసూళ్లు అంతకు మించి ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా సామ్ సి ఎస్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు