‘ఏలుమలై’ నుంచి మంగ్లీ ‘కాపాడు దేవా’ పాట విడుదల

‘ఏలుమలై’ నుంచి మంగ్లీ ‘కాపాడు దేవా’ పాట విడుదల

Published on Aug 10, 2025 8:00 AM IST

Kaapadu Deva

తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో, పునీత్ రంగస్వామి రచన-దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఏలుమలై’ నుంచి భావోద్వేగభరితమైన ‘కాపాడు దేవా’ పాటను విడుదల చేశారు. ఈ పాటను మంగ్లీ హృదయానికి హత్తుకునేలా ఆలపించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యానికి డి. ఇమ్మాన్ అందించిన స్వరాలు మరింత మెరుగులు దిద్దాయి. ప్రేమ జంట విడిపోవాల్సిన తీరును, దైవనటుని ఆటను చూపించేలా పాట సౌండ్, లిరిక్స్ ప్రభావం చూపుతున్నాయి.

హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రియాంక ఆచార్ కథానాయికగా, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో, తరుణ్ సుధీర్ క్రియేటివ్స్ మరియు డీఈ ఆర్ట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.

ఇప్పటికే టైటిల్ టీజర్, పోస్టర్, పాటలు మంచి బజ్ తీసుకువచ్చాయి. ముఖ్యంగా సిధ్ శ్రీరామ్ పాడిన ‘రా చిలకా’ యూట్యూబ్‌లో ట్రెండ్ అయింది. కర్ణాటక-తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన చామరాజనగర్, సేలం, ఈరోడ్‌లలో చిత్రీకరణ జరిగింది. ‘ఏలుమలై’ను తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు