మృణాల్ పాత వీడియో వైరల్.. గట్టి కౌంటర్ ఇచ్చిన మరో హీరోయిన్!

మృణాల్ పాత వీడియో వైరల్.. గట్టి కౌంటర్ ఇచ్చిన మరో హీరోయిన్!

Published on Aug 15, 2025 12:01 AM IST

Bipasha-Basu-Mrunal-Thakur

అందాల భామ మృణాల్ ఠాకూర్ ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్‌గా ఆమె హీరో ధనుష్‌తో డేటింగ్ చేస్తుందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే, తాజాగా ఆమెకు సంబంధించి ఓ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందో తెలుసా..?

మృణాల్ ఠాకూర్ ఓ వీడియోలో నటి బిపాషా బసు గురించి కొన్ని అభ్యంతరకర కామెంట్స్ చేసింది. ఆడవాళ్లు తనలా నాజుగ్గా ఉండాలని.. బిపాషా మాదిరి కండలు తిరిగిన వారిలా ఉండకూడదని.. ఆమెను చూస్తే మగవారిలా అనిపిస్తారని మృణాల్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా బిపాషా బసు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఈ కామెంట్స్‌కు గట్టి కౌంటర్ అని చెప్పాలి.

‘‘మహిళలు ఒకరి ఉన్నతి కోసం మరొకరు ప్రయత్నిస్తారని.. ఆడవారు బలంగా ఉండాలని.. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని.. అమ్మాయిలు బలంగా కనిపించకూడదు అనే పాత ఆలోచన నుంచి బయటకు రండి..’’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. ఇది మృణాల్ చేసిన కామెంట్స్‌కు సాలిడ్ కౌంటర్ అని అభిమానులు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు