‘ఓజి’ సెంకడ్ సింగిల్ కోసం కన్మణి ఎదురుచూపులు.. థమన్ ఏమన్నాడంటే..?

‘ఓజి’ సెంకడ్ సింగిల్ కోసం కన్మణి ఎదురుచూపులు.. థమన్ ఏమన్నాడంటే..?

Published on Aug 16, 2025 6:59 PM IST

OG 6

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజి’ చిత్రం నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాను దర్శకుడు సుజిత్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

అయితే, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. కన్మణి అనే పాత్రలో అమ్మడి క్యూట్ పిక్స్‌ను ఓజి మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్‌లో ప్రియాంక అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే, ఈ ట్రీట్‌తో పాటు మేకర్స్ రెండో సింగిల్ సాంగ్‌పై కూడా ఓ అప్డేట్ ఇచ్చారు.

ఓజి చిత్రంలోని సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమోను త్వరలోనే రిలీజ్ చేస్తామని.. ఈ పాట సోల్‌ఫుల్‌గా ప్రేక్షకులను కట్టిపడేయనుందని చిత్ర యూనిట్ రివీల్ చేసింది. అటు కన్మణిగా నటిస్తున్న ప్రియాంక కూడా తనకు ఎంతో ఇష్టమైన పాట కోసం తాను ఎదురుచూస్తున్నానని పేర్కొంది. దీనికి సమాధానంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ప్రేక్షకుల కన్నీళ్లకు ఈ పాట పూర్తి న్యాయం చేస్తుందని.. కన్మణి పాత్రను ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకుంటారని ఆయన కామెంట్ చేశాడు. మొత్తానికి ఓజి మేకర్స్ ప్రమోషన్స్‌తో దూకుడు పెంచడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు