సుందరకాండ అందరికీ నచ్చే సినిమా అవుతుంది – నారా రోహిత్

సుందరకాండ అందరికీ నచ్చే సినిమా అవుతుంది – నారా రోహిత్

Published on Aug 16, 2025 7:30 AM IST

Sundarakanda 1

హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. ‘సుందరకాండ ట్రైలర్, సాంగ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి ఈ సినిమాను చూడొచ్చు. సినిమా మొదలైనప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో ఇప్పుడు అంతే హ్యాపీగా ఉన్నాం. వినాయక చవితికి ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ట్రైలర్ ని లాంచ్ చేసిన ప్రభాస్ గారికి థాంక్యూ. వినాయక చవితి రోజు ఫ్యామిలీ అంతా కలసి థియేటర్స్ లో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.’ అని అన్నారు.

శ్రీ దేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ..‘ఆగస్టు 27న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ రోజు కోసం మేమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నాం. మా టీమ్ అందరికీ థాంక్యు వెరీ మచ్. సినిమా మొత్తం చాలా ఎంజాయ్ చేశాం. ప్రమోషన్స్ లో ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా కాలం తర్వాత ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసిన ప్రభాస్ గారికి థాంక్యూ సో మచ్. థియేటర్ కి వచ్చి అందరూ హ్యాపీగా చూడొచ్చు.’ అని అన్నారు.

నటి వాసుకి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పనిచేసిన అందరికీ మంచి సెన్స్ అఫ్ హ్యుమర్ ఉంది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అది మీకు తెలుస్తుంది. నాకు రొమాంటిక్ కామెడీ సినిమాలు ఇష్టం. రోహిత్ గారికి థాంక్యూ సో మచ్. ఈ టీం తో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అవ్వకండి. సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.’ అని అన్నారు.

డైరెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అందరికీ థాంక్ యూ. ఆగస్టు 27న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ సినిమా పండగ రోజు రిలీజ్ అవ్వడం ఒక డ్రీమ్ మూమెంట్. సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను.’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నటుడు నరేష్, హీరోయిన్ వృతి వాఘాని, నిర్మాత సంతోష్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు