‘జాంబీ రెడ్డి 2’ పై సాలిడ్ అప్డేట్ బయటకి!

‘జాంబీ రెడ్డి 2’ పై సాలిడ్ అప్డేట్ బయటకి!

Published on Feb 25, 2026 4:30 PM IST

zombie reddy

మన తెలుగు సినిమా దగ్గర వినూత్న సబ్జెక్టు లతో ఆకట్టుకున్న టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ నుంచి వచ్చిన చిత్రాల్లో “జాంబీ రెడ్డి” కూడా ఒకటి. తన హను మాన్ హీరో తేజ సజ్జతో చేసిన ఈ జాంబీ బ్యాక్ డ్రాప్ చిత్రం మంచి హిట్ అయ్యింది. దీని తర్వాతే హను మాన్ చేసి దానితో కూడా సక్సెస్ అయ్యారు. ఇక జాంబీ రెడ్డి 2 ని కొన్నాళ్ల కితమే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం తాలూకా ప్రీ ప్రొడక్షన్ పనులు మేకర్స్ శరవేగంగా పూర్తి చేస్తుండగా ప్రశాంత్ వర్మ కథ మొత్తాన్ని పూర్తి చేసి స్క్రిప్ట్ లాక్ చేసేసారట. ఇక ఈ చిత్రాన్ని మరో ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించనుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించనున్నారు. సో ఈ చిత్రం కూడా అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక దీంతో పాటుగా తేజ హను మాన్ సీక్వెల్ జై హనుమాన్ లో కూడా కనిపించనున్నాడు.

తాజా వార్తలు