టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రావు బహదూర్’ నుంచి ఇటీవల ఓ స్టన్నింగ్ పోస్టర్ బయటకు రావడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వెంకటేష్ మహా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా కంటెంట్‌పై అందరిలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఇప్పుడు ఈ బజ్‌ను మరింత పెంచేలా ఈ చిత్ర టీజర్ లాంచ్‌కు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ టీజర్ లాంచ్‌ను ఆగస్టు 18న ఉదయం 11.07 గంటలకు చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక ఈ టీజర్‌ను దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నట్లు వారు అనౌన్స్ చేశారు.
దీంతో ఈ సినిమాలోని కంటెంట్‌పై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని 2026 వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


