‘బ్యూటీ’ మూవీ నుంచి యూత్‌ఫుల్ లవ్ సాంగ్‌ – ‘ప్రెట్టీ ప్రెట్టీ’ విడుదల

‘బ్యూటీ’ మూవీ నుంచి యూత్‌ఫుల్ లవ్ సాంగ్‌ – ‘ప్రెట్టీ ప్రెట్టీ’ విడుదల

Published on Sep 1, 2025 7:00 AM IST

5 1

యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్‌కి ఎప్పుడూ హిట్ టాక్ దక్కుతుంది. అదే ఆకర్షణను తెచ్చేలా, జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ నిర్మిస్తున్న ‘బ్యూటీ’ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్, టీజర్, పాటలతో బజ్ క్రియేట్ చేసిన టీం, తాజాగా ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అనే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. విజయ బుల్గానిన్ మ్యూజిక్, సనారే ట్రెండీ లిరిక్స్, జాతీయ అవార్డు గెలుచుకున్న పీవీఎన్ఎస్ రోహిత్ వాయిస్ ఈ పాటను ప్రత్యేకంగా నిలిపాయి. లిరికల్ వీడియోలో అంకిత్ కొయ్య, నీలఖి జంట కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాను జె.ఎస్.ఎస్. వర్ధన్ డైరెక్ట్ చేస్తుండగా, కథ–స్క్రీన్‌ప్లేను ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. నటీనటుల్లో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి, నంద గోపాల్ తదితరులు ఉన్నారు.

తాజా వార్తలు