భారీ బిజినెస్ కి తెరలేపుతున్న ‘పెద్ది’.. మెయిన్ గా ఇక్కడ

భారీ బిజినెస్ కి తెరలేపుతున్న ‘పెద్ది’.. మెయిన్ గా ఇక్కడ

Published on Feb 24, 2026 9:00 AM IST

peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో చేస్తున్న రెండో సినిమా ఇది కాగా ఈ సినిమాపై భారీ హైప్ ఇప్పుడు నెలకొంది. అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కోసం ఆన్ టైం సినిమాని తీసుకురావాలని మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పెద్ది భారీ బిజినెస్ కి తెరలేపుతున్నట్టు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం బిజినెస్ లెక్కలు ఊహించని రీతిలో ఉన్నాయని వినిపిస్తోంది. సో మెగాపవర్ స్టార్ కి తగ్గ సాలిడ్ సబ్జెక్ట్ పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో దీనితో అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమా ఔట్ పుట్ కూడా అదిరే లెవెల్లో వస్తుంది అని సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

దర్శకుడు బుచ్చిబాబు సానా పర్ఫెక్ట్ గా ఈ సినిమాని తీస్తున్నాడట. సో చూడాలి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అనేది. ఇక ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

తాజా వార్తలు