బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘పురుష:’. బత్తుల కోటేశ్వరరావు తనయుడు పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి ప్రముఖ కమెడియన్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రల్లో కనిపిస్తారు. చిత్రీకరణ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
సినిమా కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు తెలియజేసే విధంగా ‘ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనక ఓ ఆడది ఉంటుంది’, ‘స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం’ వంటి విభిన్నమైన క్యాప్షన్లతో పోస్టర్లను విడుదల చేస్తూ ‘పురుష:’ టీమ్ అంచనాలను పెంచుతోంది. ఈ పోస్టర్ల ద్వారానే సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తున్నారు. త్వరలోనే ఈ కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సతీష్ ముత్యాల (సినిమాటోగ్రాఫర్), శ్రవణ్ భరద్వాజ్ (సంగీత దర్శకుడు), కోటి (ఎడిటర్), రవిబాబు దొండపాటి (ఆర్ట్ డైరెక్టర్) సాంకేతిక నిపుణులుగా వ్యవహరిస్తున్నారు.


