విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’ విడుదలై పాతికేళ్లు దాటినా ఇప్పటికీ ఎంతో ఆదరణ పొందుతుంది. కె.విజయభాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఇటీవల జనవరి 1న థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. అయితే, సంక్రాంతి హడావుడి వల్ల ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.
సాధారణంగా రీ-మాస్టర్ చేసిన 4K ప్రింట్లను మేకర్స్ తమవద్దే పెట్టుకుంటుంటారు. కానీ, ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ మాత్రం ఈ చిత్రాన్ని 4K క్వాలిటీతో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. దీంతో మూవీ లవర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని 4K క్వాలిటీలో ఉచితంగా వీక్షించే అవకాశం లభించింది.
గతంలో వచ్చిన మురారి, శివ వంటి చిత్రాల 4K వెర్షన్లు థియేటర్లకే పరిమితం కాగా, ఈ సినిమాను హై-క్వాలిటీతో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం విశేషం. త్రివిక్రమ్ డైలాగులు, వెంకటేష్ టైమింగ్, కోటి సంగీతం కలగలిసిన ఈ కంప్లీట్ ప్యాకేజీని ఇప్పుడు ఫ్యాన్స్ ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయవచ్చు.


