మరో కొత్త సినిమా ప్రారంభించిన సంగీత్ శోభన్

మరో కొత్త సినిమా ప్రారంభించిన సంగీత్ శోభన్

Published on Nov 15, 2025 8:28 AM IST

add

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని-గిరిబాబు వల్లభనేని, టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబినేషన్‌లో ఓ సరికొత్త ప్రాజెక్ట్ రానుంది. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం, ఈ రోజు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్క్రిప్ట్‌ను అందించగా, నిర్మాత ఎస్‌కేఎన్ ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. టీమ్‌కు తమ శుభాకాంక్షలూ తెలిపారు. తాజా ట్రెండ్‌కు తగ్గట్టుగా, కొత్తదనం ఉన్న లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ రచయితగా పనిచేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు