ఓటీటీలో ఊచకోత.. మెగాస్టార్ సినిమాకి ఏకంగా 500 మిలియన్లు

ఓటీటీలో ఊచకోత.. మెగాస్టార్ సినిమాకి ఏకంగా 500 మిలియన్లు

Published on Feb 19, 2026 9:00 PM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఎంటర్టైనర్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం తెలిసిందే. మంచి బజ్ నడుమ వచ్చి ఏకంగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా ఈ చిత్రం నిలిచి దుమ్ము లేపింది. అయితే ఈ చిత్రం రీసెంట్ గానే ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. జీ 5 వారు స్ట్రీమింగ్ కి తీసుకొచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

అందులో ఫాస్టెస్ట్ 200, 300 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 500 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసి మరో రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఇలా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓటిటిలో కూడా అద్భుతాలు సెట్ చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో వెంకీ మామ మంచి గెస్ట్ రోల్ లో నటించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు