‘ట్రావెలింగ్ సోల్జర్’ రమణ గోగుల గ్లోబల్ టూర్… ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు

‘ట్రావెలింగ్ సోల్జర్’ రమణ గోగుల గ్లోబల్ టూర్… ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు

Published on Nov 23, 2025 8:00 AM IST

ramana

తెలుగు సంగీత ప్రియులను ఒక తరాన్ని ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు రమణ గోగుల, తన పాటల ప్రయాణాన్ని విశ్వ వేదికపైకి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. ‘ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్’ పేరుతో భారీ గ్లోబల్ కాన్సర్ట్ టూర్‌ను ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తెలుగు సంగీత చరిత్రలో ఒక సంగీత దర్శకుడు పూర్తిస్థాయి ప్రపంచ పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్, టాప్ నాచ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్ట్రేలియా సంయుక్తంగా ఫిబ్రవరి 2026లో ఆస్ట్రేలియా టూర్‌తో ఈ యాత్రను ప్రారంభిస్తాయి. తదుపరి దశల్లో యూకే, అమెరికాలలో కచేరీలు ప్లాన్ చేశారు. ఈ టూర్ కేవలం పాటల కచేరీలకు మాత్రమే పరిమితం కాకుండా, రమణ గోగుల ఐకానిక్ పాటల వెనుక ఉన్న కథలు, సరదా సంభాషణలు, జ్ఞాపకాల అన్వేషణగా సాగనుంది.

ఈ సందర్భంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ మాట్లాడుతూ, ఇది కేవలం ఒక టూర్ కాదని, భావోద్వేగాల ఉద్యమమని, ‘ట్రావెలింగ్ సోల్జర్’ తొలిసారిగా ప్రపంచ వేదికపైకి అడుగుపెడుతున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రమణ గోగుల ప్రయాణ అనుభవాలతో కూడిన ఒక వినూత్న ‘డాక్యు-మ్యూజికల్ సిరీస్’ను రూపొందించి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయనున్నారు. ఈ యాత్ర ప్రవాస భారతీయులను కళ, కథల ద్వారా ఏకం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టూర్ కోసం వీసాలు అందించిన ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థకు టీమ్ కృతజ్ఞతలు తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు