గచ్చిబౌలి స్టేడియంలో మహా న్యూస్ శ్రీనివాస కళ్యాణం – ప్రముఖులు, భక్తుల సందడి

గచ్చిబౌలి స్టేడియంలో మహా న్యూస్ శ్రీనివాస కళ్యాణం – ప్రముఖులు, భక్తుల సందడి

Published on Nov 28, 2025 11:00 AM IST

Untitled 1 2

మహా న్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మారెళ్ళ వంశీకృష్ణ తెలిపారు. ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.

ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీ బండి సంజయ్‌ కుమార్‌, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీ రఘురామకృష్ణం రాజు, శ్రీ చామల కిరణ్‌ కుమార్ రెడ్డి, శ్రీ అరికపూడి గాంధీ, శ్రీ ఏలూరి సాంబశిరావు, శ్రీ శివసేనా రెడ్డి వంటి నాయకులు పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి విజయేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, అనన్య నాగెల్లా, ఆకాష్ పూరి, శివ బాలాజీ & మధుమిత, రాకింగ్ రాకేష్ & జోర్దార్ సుజాత, దామోదర్ ప్రసాద్, మానస వారణాసి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తదితరులు హాజరై సందడి చేశారు.

ఈ సందర్భంగా మారెళ్ళ వంశీకృష్ణ మాట్లాడుతూ, తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తిరుపతి నుండి విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన టీటీడీ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, సుదర్శన్ దీక్షితులు, గోవిందరాజు, వేద పండితులు, ఇతర టీటీడీ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Untitled 1.jpg1

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు