ఎపిక్ : అదిరిపోయిన 90s సీక్వెల్ టైటిల్!

ఎపిక్ : అదిరిపోయిన 90s సీక్వెల్ టైటిల్!

Published on Dec 1, 2025 6:19 PM IST

90s Sequel Titled Epic First Semester

టాలీవుడ్‌లో తెరకెక్కిన 90s వెబ్ సిరీస్ ఎలాంటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఆదిత్య హాసన్ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో బ్లాక్‌బస్టర్ సక్సె్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఆ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ రూపొందిస్తున్నారు మేకర్స్.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ఓ ఇంట్రెస్టింగ్ వీడియోతో అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వైష్ణవి చైతన్య కోరుకునే అబ్బాయి ఎలా ఉండాలో, దానికి పూర్తి భిన్నంగా హీరో ఉండటం మనకు ఈ వీడియోలో చూపెట్టారు. ఇక ఈ వీడియోలో ఫారిన్ కాలేజీకి లెజెండ్ ‘గద్దర్’ మార్క్ వేషధారణలో హీరో రావడం విశేషంగా ఆకట్టుకుంటోంది.

మొత్తానికి ఈసారి కూడా ఆదిత్య హాసన్ తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూనే ఓ మంచి ప్రేమకథను మనకు చూపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు