సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “జైలర్ 2”. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి హైప్ అయితే ఉంది. ఇక ఈ సినిమాలో కూడా మరింతమంది బిగ్ స్టార్స్ కనిపించనుండగా ఓ ఆసక్తికర టాక్ ఈ సినిమాపై ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో ఇప్పుడు రాబోతున్న సినిమా మనం చూసిన దానికి కొనసాగింపుగా కాకుండా ముందు కథగా ఉంటుంది అని వినిపిస్తుంది.
అంటే జైలర్ ప్రీక్వెల్ గా ఇది ఉంటుందట. మరి జైలర్ 2 అనే పెట్టారు కాబట్టి అది సీక్వెల్ గా ఉంటుందా లేక ప్రీక్వెల్ నా అనేది ఓ క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కూడా శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ ఇంకా వినాయకన్ తో పాటుగా మరింతమంది సర్ప్రైజ్ చేయనున్నారట. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


