పండుగ ట్రీట్ రెడీ చేస్తున్న శర్వా..!

పండుగ ట్రీట్ రెడీ చేస్తున్న శర్వా..!

Published on Dec 4, 2025 12:33 AM IST

Naari Naari Naduma Murari

చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన రెండు సినిమాలను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే డిసెంబర్ 6న రావాల్సిన ‘బైకర్’ సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. కొత్త తేదీపై క్లారిటీ లేకపోవడం, ప్రమోషన్లు మొదలుకావడం లేదన్నది మరింత అనుమానాలు పెంచుతోంది. డిసెంబర్ 25న కూడా భారీ పోటీ ఉంది. మరి అప్పుడు కూడా ఈ సినిమా వస్తుందో లేదో క్లారిటీ లేదు.

ఇక సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో శర్వా ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయం. పాత సంక్రాంతి క్లాషులతో వచ్చిన శర్వానంద్ హిట్లను నిర్మాత అనిల్ సుంకర గుర్తు చేస్తూ ఈ పండగకి థియేటర్లలోకి దిగుతామనే క్లూ ఇచ్చారు.

ఇప్పటికే ఆరు సినిమాలు సంక్రాంతి రేసులో ఉండగా, ఇది ఏడవదిగా జాయిన్ అవుతోంది. థియేటర్లు తక్కువగా ఉండటంతో కొన్ని సినిమాలు తప్పనిసరిగా తప్పుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. కంటెంట్‌పై నమ్మకం ఉన్నా, ఇంత భారీ క్లాష్‌లో దిగడం సేఫ్ కాదనే అభిప్రాయం వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు