ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ అంతా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం”. బాలయ్య బోయపాటి కాంబినేషన్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా ఇదే కాగా కేవలం అభిమానులు మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇతర ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఎగ్జైటెడ్ గానే ఉన్నారు. అయితే ఈ సినిమాలో గత పార్ట్ 1 లో నటించిన హీరోయిన్ ప్లేస్ లో సంయుక్త మీనన్ ఉండడంతో ప్రగ్యా జైస్వాల్ ఏమైనట్టు అనే టాక్ చాలా మందిలో వచ్చింది.
అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం రివీల్ చేశారు బాలయ్య. పార్ట్ 2 లో ప్రగ్యా పాత్ర ఏం చేస్తుంది అని ఆలోచించాం కానీ పెద్దగా స్కోప్ ఉన్నట్టు అనిపించలేదు అని అలాగే సినిమా నిడివి కూడా పెద్దది అయిపోతుండడంతో ఆమె పాత్రని ముగించేసాం అని తెలిపారు. దీనితో అఖండ 2 లో ఆమె పాత్ర చనిపోయినట్టు తెలిపారు. సో ఇలా ప్రగ్యా జైస్వాల్ అఖండ 2 లో మిస్సయ్యిందట. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహించారు.


