బాలకృష్ణ నటించిన అఖండ 2 ఇంకొద్ది గంటల్లోనే థియేటర్లలోకి రానుంది. అయితే ఇండియాలో ప్లాన్ చేసిన ప్రీమియర్ షోలు టెక్నికల్ సమస్యల వల్ల చివరి నిమిషంలో రద్దు కావడం హాట్ టాపిక్‌గా నిలిచింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బాలయ్య ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సరైన కథ లేకపోయినా, కొంతమంది దర్శకులు సినిమాలను మూడు గంటలకు పైగా అక్కర్లేకుండా లాగుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఏ దర్శకుణ్ణి ఉద్దేశించి చేశారన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
సినిమా నిడివి చాలా ముఖ్యమని, అది ఎక్కువగా ఉండకూడదని బాలయ్య స్పష్టం చేశారు. అఖండ 2లో అనేక ఎలిమెంట్లు ఉన్నప్పటికీ, ప్రేక్షకులకు పర్ఫెక్ట్గా అనిపించేలా నిడివిని సెట్ చేశామని తెలిపారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట నిర్మించిన ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు.


