వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘పోలీస్ కంప్లెయింట్’ చిత్రం షూటింగ్ పూర్తయింది. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. యాక్షన్, విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి ఇందులో పవర్‌ఫుల్ పాత్రలో, తొలిసారి పూర్తి వినోదాత్మకమైన రోల్‌లో నటిస్తున్నారు.
ఈ సినిమాకు సూపర్‌స్టార్ కృష్ణ గారిపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ హారర్ థ్రిల్లర్‌ను కొత్త కోణంలో చూపించనున్నట్లు దర్శకుడు సంజీవ్ మేగోటి పేర్కొన్నారు. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందనే భావన ఈ చిత్ర ఇతివృత్తం.
బాలకృష్ణ మహరాణా MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, సప్తగిరి వంటి పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.


