రామ్ కిరణ్, మేఘా ఆకాశ్ జంటగా ఉదయ్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న “స:కుటుంబానాం” చిత్రానికి కొత్త విడుదల తేదీ ఖరారైంది. మొదట డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం, అదే రోజు బాలకృష్ణ అఖండ 2: తాండవం విడుదల కావడంతో, మేకర్స్ విడుదల తేదీని మార్చాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో, స:కుటుంబానాం ఇప్పుడు డిసెంబర్ 19, 2025న విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ టీమ్ ఇలా తెలిపింది: “కొన్ని నిర్ణయాలు బిజినెస్ వల్ల కాదు, గౌరవం మరియు భావోద్వేగాల వల్ల తీసుకుంటాం. నందమూరి బాలకృష్ణ గారిపైన ఉన్న ప్రేమ, గౌరవంతో స:కుటుంబానాం విడుదలను డిసెంబర్ 19కి మార్చుతున్నాం. డిసెంబర్ 12న అఖండ 2 రాజ్యమేలాలి. ఈ సినిమాను పండుగలా అందరం కలిసి జరుపుకుందాం.”
ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. HNG సినిమాస్ LLP బ్యానర్‌పై మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మధు దాసరి, ఎడిటింగ్ శశాంక్ మాలి చేతులు కలిపి చేస్తున్నారు.


