సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధమైన ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘ది రాజాసాబ్’, ‘అనగనగా ఒక రాజు’ చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్లు ఇటీవలి కాలంలో విజయాలు అందుకోకపోవడంతో, ఈ సినిమాలు వారి కెరీర్‌కు కీలకంగా భావిస్తున్నారు. ‘జవాన్’ తర్వాత వరుస పరాజయాలను చూసిన నయనతార, ఇప్పుడు ‘శంకర ప్రసాద్’తో మళ్లీ హిట్ సాధించాలని ఎదురుచూస్తోంది.
నిధి అగర్వాల్ ‘హరిహర వీరమల్లుతో’ బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకున్నా ఫలితం రాలేదు. ఆమె ఆశలు ఇప్పుడు ‘రాజాసాబ్’పై ఉన్నాయి. ఇదే చిత్రంలో మాళవిక మోహనన్ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. మీనాక్షి చౌదరి కూడా ‘అనగనగా ఒక రాజు’ ద్వారా తన సత్తా నిరూపించుకోవాలని చూస్తోంది. డింపుల్ హయతి రవితేజతో చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో హిట్ కోసం ఎదురు చూస్తోంది.
బుట్టబొమ్మ పూజా హెగ్డే బాలీవుడ్‌లో చేసిన చిత్రాలు ప్లాప్ కావడంతో, ఇప్పుడు విజయ్‌తో చేసిన ‘జన నాయగన్’నే ప్రధాన అవకాశంగా చూస్తోంది. ఈ సంక్రాంతి విడుదల కానున్న ఈ సినిమాలు ఈ నాయికల కెరీర్‌లకు కొత్త ఊపునిస్తాయా లేదా అన్నది త్వరలోనే నిర్ణయం కానుంది.


