‘డ్రాగన్’ కోసం ల్యాండ్ అయ్యిన హీరో..!

‘డ్రాగన్’ కోసం ల్యాండ్ అయ్యిన హీరో..!

Published on Aug 5, 2026 2:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ నే ‘డ్రాగన్’. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూట్ లో తారక్ కి ఇటీవల చిన్న గాయం అయ్యి కొన్ని వారాల పాటుగా రెస్ట్ తీసుకోనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తారక్ లేని సన్నివేశాలు అన్నీ తెరకెక్కించే పనిలో ఉన్నారని టాక్ వచ్చింది.

అయితే హీరో రెస్ట్ లో ఉంటే మరో హీరో ఇప్పుడు షూట్ కోసం ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. అదేంటి ఎలా అనుకుంటున్నారా? డ్రాగన్ గ్లింప్స్ లో తారక్ సహా అందరినీ విలన్స్ గా పరిచయం చేసి వాళ్ళని ఆపడానికి వచ్చే హీరోస్ లో ఒకరిగా బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ ని పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేసిన సంగతి తెలిసిందేగా..

ఇప్పుడు ఈ నటుడు డ్రాగన్ షూట్ కోసం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షూట్ కి తాను హాజరు కానున్నట్టు టాక్. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు