పిక్ టాక్: స్టైలిష్ స్టార్ ఈజ్ బ్యాక్.. కొత్త లుక్ తో కిక్!

పిక్ టాక్: స్టైలిష్ స్టార్ ఈజ్ బ్యాక్.. కొత్త లుక్ తో కిక్!

Published on Dec 12, 2025 10:09 AM IST

allu arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు తన కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినిమా నుంచే ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకి ముందు వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం పుష్ప చిత్రాలతో తాను స్టైలిష్ స్టార్ ట్యాగ్ నుంచి ఐకాన్ స్టార్ గా మారడం జరిగింది. అయితే అసలు అల్లు అర్జున్ అంటేనే స్టైల్ అన్నట్టు తాను స్టాండర్డ్స్ సెట్ చేసుకున్నాడు.

మరి అలాంటి స్టైలిష్ స్టార్ మళ్ళీ ఇప్పుడు కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. లేటెస్ట్ గా యంగ్ హీరో ప్రియదర్శి అండ్ కోర్ట్ సినిమా టీం బన్నీని కలిసిన పిక్స్ బయటకి రాగా ఇందులో అల్లు అర్జున్ లుక్స్ ఇంకా స్టైలింగ్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మళ్ళీ వింటేజ్ బన్నీని చూస్తున్నట్టుగా అనిపించడంతో నెక్స్ట్ సినిమాలో మాత్రం కిక్ ఇచ్చే ట్రీట్ ఉంటుంది అని డిసైడ్ అయిపోయారు. అట్లీ స్టైలిష్ టేకింగ్ లో అల్లు అర్జున్ లాంటి హీరో అంటే ఫ్రేమ్ మరింత స్టైలిష్ గా మారిపోతుంది. సో ఈ కాంబినేషన్ కోసం ఇంకొంతకాలం ఎదురు చూడాల్సిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు