మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న వస్తుండటంతో అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకునేందుకు ఇప్పటినుంచే రెడీ అవుతున్నారు. ఇక ఈ క్రమంలో తమ అభిమాన హీరో నుంచి సినిమా అప్డేట్స్ కోరుతున్న ఫ్యాన్స్, చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్న ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద అక్టోబర్ 15న రాబోతున్న రజనీకాంత్ ‘జైలర్ 2’తో ఈ చిత్రం తలపడేందుకు సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.


