Jailer 2: ఇలా సరిపెట్టేశారా?

Jailer 2: ఇలా సరిపెట్టేశారా?

Published on Dec 12, 2025 11:18 AM IST

Jailer2

సూపర్ స్టార్ రజినీకాంత్ తన 75వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా అభిమానులు కోలీవుడ్ సహా భారతదేశ సినీ ప్రముఖులు అంతా కూడా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ బిగ్ డేకి అభిమానులు చాలానే హోప్స్ కూడా పెట్టుకున్నారు. తన నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ మెయిన్ గా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న అవైటెడ్ సినిమా జైలర్ 2 టీజర్ ని చాలా మంది ఆశించారు కానీ మేకర్స్ మాత్రం ఈ విషయంలో మౌనంగానే కొనసాగడం జరిగింది.

కేవలం జైలర్ 2 సెట్స్ లో తలైవర్ పుట్టినరోజు ఒక్కటి మాత్రం జరిపి సరిపెట్టేసారు. దీనిపై ఓ వీడియో వదిలారు తప్పితే అందులో కూడా ఎలాంటి హింట్ కూడా ఇవాళ ఏదైనా చిన్న ట్రీట్ ఉంటుందా అనే దానిపై లేదు. సో ఈసారి మాత్రం ఎలాంటి సర్ప్రైజ్ లేనట్టే అనుకోవాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు