విడుదల తేదీ : డిసెంబర్ 12, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీష్ యోహన్ కురువిల్ల తదితరులు
దర్శకుడు : జెనూస్ మొహమద్
నిర్మాతలు : వి.ఆనంద ప్రసాద్
సంగీత దర్శకుడు : ఓషో వెంకట్
సినిమాటోగ్రాఫర్ : అభినందన్ రామానుజం
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
‘అఖండ 2’లో విలనిజం చూపెట్టిన నటుడు ఆది పినిశెట్టి, ‘డ్రైవ్’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
మీడియా దిగ్గజం జయదేవ్ రెడ్డి (ఆది పినిశెట్టి) ఒక జాతీయవాద గ్రూప్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకుని తన కుటుంబంతో లండన్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. ఒక హ్యాకర్ ఆ ఒప్పందాన్ని బహిర్గతం చేసి, జయదేవ్ జీవితాన్ని బట్టబయలు చేయడంతో పరిస్థితి తలకిందులవుతుంది. ఆ హ్యాకర్ జయదేవ్‌కు దగ్గరివారిని టార్గెట్ చేయడం కొనసాగిస్తాడు. ఇంతకీ ఈ హ్యాకర్ ఎవరు..? అతను జయదేవ్‌ను ఎందుకు వెంటాడుతున్నాడు..? వారి పోరాటం ఎలా ముగుస్తుంది..? అనే అంశాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఆది పినిశెట్టి పర్వాలేదనిపించే నటనను ప్రదర్శించాడు. కానీ అది సినిమాను ఏ మాత్రం పైకి లేపలేదు. హ్యాకర్‌తో అతని సంభాషణల్లో కొన్ని పర్వాలేదనిపించినా, వాటి ప్రభావం పరిమితంగా నిలిచింది.
క్లైమాక్స్‌లో సత్యదేవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. ఇక ఈ సినిమాకు కొనసాగింపు ఉంటదనే విషయాన్ని అతడి పాత్ర సూచిస్తుంది. లొకేషన్ ఎంపికలు మరియు సమర్థవంతమైన కెమెరా పనితనం కారణంగా కొన్ని విజువల్స్ అప్పుడప్పుడు ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రం రివెంజ్ డ్రామాగా తెరకెక్కినా, దానికి కావాల్సిన టెన్షన్ ఎక్కడా కనిపించదు. కథ చాలా రొటీన్‌గా సాగుతూ.. హ్యాకర్ అసలు ఉద్దేశ్యం ఏమిటనే విషయాన్ని పూర్తిగా రివీల్ చేయలేకపోతుంది. అతని సామర్థ్యాలను బట్టి, అతను వెంటనే సమస్యను పరిష్కరించగలడు లేదా తీవ్ర నష్టం కలిగించగలడు. అయినప్పటికీ స్క్రిప్ట్ అతన్ని కేవలం రివెంజ్ తీర్చుకునే పాత్రకే పరిమితం చేస్తుంది.
మడోన్నా సెబాస్టియన్ పాత్ర కథనానికి ఏ మాత్రం ఉపయోగపడదు. ఆమె సన్నివేశాలు ఎక్కువగా సీరియస్ సీన్స్‌లో రావడం.. తరుచూ ప్రశ్నలను అడగడం వంటిది చేస్తుంది. దీంతో సీరియస్ మూమెంట్స్ కూడా కామెడీగా మారుతాయి.
చాలా సన్నివేశాల్లో లాజిక్ లోపిస్తుంది. ఆ విషయాలను పక్కకుపెట్టినా, ఈ చిత్రంపై ఆసక్తి క్రియేట్ అయ్యేందుకు బలమైన కథ కూడా లేదు.
సాంకేతిక విభాగం :
రచయిత మరియు దర్శకుడు జనూస్ మహమ్మద్ మజీద్ ఉత్కంఠను పెంచడంలో, వేగాన్ని కొనసాగించడంలో లేదా కథాంశానికి భావోద్వేగాలను తీసుకురావడంలో విఫలమయ్యాడు. రచన అంతటా డెప్త్ లోపిస్తుంది. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా నిలుస్తుంది. ఓషో వెంకట్ సంగీతం సందర్భానికి తగినట్లుగా అనిపించదు మరియు పెద్దగా మెప్పించదు. ప్రవీణ్ పూడి సినిమాను సమన్వయంగా ఉంచడానికి ప్రయత్నించారు, కానీ ద్వితీయార్థం నెమ్మదిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘డ్రైవ్’ ఎటువంటి కొత్తదనం లేని డల్‌గా సాగే రివెంజ్ డ్రామా. బలహీనమైన కథ మరియు ఫ్లాట్ ఎగ్జిక్యూషన్‌తో ఈ చిత్రం ఎలాంటి ప్రభావం చూపదు. ఆది పినిశెట్టి నటన వృథా అయినట్లు అనిపిస్తుంది. బలమైన రైటింగ్‌తో పాటు బెటర్ డైరెక్షన్ చేసి ఉంటే ఇది ఒక మంచి థ్రిల్లర్‌గా నిలిచేది. సీరియస్ థ్రిల్లర్ డ్రామా చిత్రాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని స్కిప్ చేయడం బెటర్.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team


