Akhanda 2 : ‘అఖండ 2’ డే 1 కలెక్షన్స్.. ఇది మామూలు జాతర కాదు..!

Akhanda 2 : ‘అఖండ 2’ డే 1 కలెక్షన్స్.. ఇది మామూలు జాతర కాదు..!

Published on Dec 13, 2025 12:19 PM IST

Akhanda 2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna) మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2 – తాండవం’ భారీ అంచనాల మధ్య నిన్న(డిసెంబర్ 12) వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ అయింది. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాలయ్య నటవిశ్వరూపానికి థమన్ థండరింగ్ సౌండ్ తోడవడంతో థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాకు ప్రీమియర్స్ వేయగా వరల్డ్‌వైడ్‌గా సాలిడ్ రెస్పాన్స్ దక్కిందని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. అటు తొలి రోజు కూడా అఖండ 2(Akhanda 2) చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ సినిమాకు తొలిరోజు వరల్డ్‌వైడ్‌గా సాలిడ్ కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి. ఇక అధికారికంగా ఈ చిత్రానికి ప్రీమియర్స్ కలుపుకుని తొలిరోజు వరల్డ్‌వైడ్‌గా రూ.59.5 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

దీంతో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర రుద్ర తాండవం చేస్తున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో ఈ వీకెండ్ ముగిసే సరికి ఈ చిత్ర కలెక్షన్స్ భారీగా ఉండబోతున్నట్లు వారు అంచనా వేస్తున్నారు. సంయుక్త(Samyuktha) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు