మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అయితే, నేడు(డిసెంబర్ 13) విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ సాలిడ్ సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బర్త్ డ్రే విషెస్‌తో రిలీజ్ చేశారు. అల్ట్రా కూల్ స్టైలిష్‌గా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇక ఈ సినిమా నుండి మరో ట్రీట్ కూడా రానుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


