నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఊహించని అడ్డంకులు ఎదుర్కొని ఇప్పుడు సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంటుంది. గత సినిమాలతో పోలిస్తే కొంచెం నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా ఎక్కువే వచ్చింది కానీ దానిని మించి ప్రేక్షక జనం ఈ సినిమాకి ఊహించని రెస్పాన్స్ ని అందిస్తున్నారు.
మరి ఇలా మూడో రోజు సాలిడ్ బుకింగ్స్ ని ఈ సినిమా అందుకోవడం విశేషం. ఈ ఆదివారం ఉదయం షోస్ నుంచే అఖండ 2 బుకింగ్స్ ఊపందుకున్నాయి. గంటకి 13 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోతూ సాలిడ్ ట్రెండ్ ని అఖండ 2 అందుకుంది. దీనితో మూడో రోజు కూడా అఖండ 2 అదిరే వసూళ్లు కొల్లగొట్టడం ఖాయం అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించారు.


