
రీసెంట్ గా జస్ట్ అనౌన్సమెంట్ తోనే మన టాలీవుడ్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసిన సినిమా నుంచి ఇప్పుడు ఫైనల్ గా ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. సంగీత దర్శకుడు థమన్ నుంచి వచ్చిన అనౌన్సమెంట్ కి కొనసాగింపుగా ఇప్పుడు మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ రివీల్ గ్లింప్స్ ‘ఇట్లు అర్జున’ తో యంగ్ హీరో అనీష్ ని పరిచయం చేశారు.
ఒక అందమైన ప్రేమ కథని టాప్ నాచ్ విజువల్స్ అండ్ ఒక స్టన్నింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో అద్భుతంగా తీర్చి దిద్ది మేకర్స్ సాలిడ్ కంటెంట్ ని ప్రామిస్ చేశారు. దీనితో మార్కెట్ లోకి కొత్త హీరో వచ్చాడని చెప్పొచ్చు. అనీష్ ప్రెజెన్స్ బాగుంది. హ్యాండ్సమ్ లుక్స్ కి తోడు తన ఫ్లెక్సబుల్ బాడీతో ఈజ్ గా పెర్ఫామ్ చేస్తున్నాడు.
అలాగే హీరోయిన్ అనశ్వర రాజన్ కూడా బాగుంది. మెయిన్ గా ఈ గ్లింప్స్ లో ఆకట్టుకున్న మరో అంశం ఆ నిర్మాణ విలువలు, బ్యాక్గ్రౌండ్ విజువల్స్, టీం మాత్రం మంచి అవుట్ పుట్ నే అందించారు. అలాగే థమన్ స్కోర్ కూడా మరింత ఇంపాక్ట్ చూపించింది. ఇక ఈ సినిమాతో దర్శకునిగా మహేష్ ఉప్పల పరిచయం అవుతుండగా వెంకీ కుడుముల నిర్మాణం వహిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

