పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ప్రభాస్ గెటప్ చాలా కొత్తగా ఉండబోతుందట. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేశారట. అన్నట్టు ఈ సీక్వెన్స్ లో ప్రభాస్ తో పాటు దాదాపు రెండు వందల మంది ఫైటర్స్ కూడా ఈ సీక్వెన్స్ లో కనిపిస్తారట.
మొత్తానికి ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ అవుతుందట. పైగా ఈ సీక్వెన్స్ ఈ సినిమా మొత్తానికే మెయిన్ హైలెట్ గా నిలిచిపోతుందట. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తోంది.


