తమిళ హీరో సూర్య ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన తన కెరీర్‌లోని 46వ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తు్న్నారు మేకర్స్. ఇక ఈ చిత్రాన్ని ‘సూర్య 46’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ అందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగిసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో వెంకీ అట్లూరి తన సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడని చిత్ర వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. విడుదల తేదీతో పాటు ఇతర కీలక వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.


