గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’(Akhanda 2) బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు తొలిరోజే అదిరిపోయే రెస్పాన్స్ రావడం, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
నైజాంలో ‘అఖండ 2’ స్టడీ కలెక్షన్స్..
ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు రాబడుతున్నాయి. తొలిరోజు వరల్డ్‌వైడ్‌గా రూ.59 కోట్ల వసూళ్లు(Akhanda 2 Collections) కలెక్ట్ చేసింది ఈ చిత్రం. ఇక నైజాం ఏరియాలో ఈ చిత్రం స్టడీ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. తొలిరోజు నైజాంలో ఈ చిత్రం రూ.5.85 కోట్ల షేర్ వసూలు చేయగా, మూడో రోజు రూ.2.7 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ మూవీ నైజాంలో 3 రోజుల్లో రూ.12 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
పోటీ లేకుండా దూసుకెళ్తున్న అఖండ 2..
ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పోటీ లేకపోవడంతో ఈ వారం కూడా ఈ చిత్రం స్టడీ కలెక్షన్స్‌తో రన్ అవుతుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సంయుక్త హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా, హర్షాలి కీలక పాత్రలో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేశారు.


