టాలీవుడ్‌లో ఈ వారం పలు చిత్రాలు రిలీజ్‌కు వస్తున్నాయి. ఇందులో ‘అనకాపల్లి’ అనే ఓ చిన్న సినిమా కూడా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. విక్రమ్ సహిదేవ్ హీరోగా ఖగేష్ తమ్మినేని డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు కథను అందిస్తున్నారు. ఆగస్టు 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని తొలుత మేకర్స్ భావించారు. కానీ, రిలీజ్‌కు ఒక రోజు ముందు ఇప్పుడు తమ నిర్ణయంలో మార్పును ప్రకటించారు.
అనకాపల్లి చిత్రాన్ని ఆగస్టు 7న కేవలం అనకాపల్లి ప్రాంతంలో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత లగడపాటి శ్రీధర్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని తొలుత అనకాపల్లి వాసులకు చూపెట్టి, వారి రెస్పాన్స్ చూడాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇలా ఒక్క ప్రాంతంలో మాత్రమే సినిమాను రిలీజ్ చేయడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అవుతోంది.
ఇక ఈ సినిమాలో సంధ్య వశిష్ట, తారక్ పొన్నప్ప, ఇంద్రజ, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి అనకాపల్లి వాసులను ఈ ‘అనకాపల్లి’ చిత్రం ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.


