ట్రైలర్ టాక్ : యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ‘పతంగ్’.. ప్రేమ కోసం యుద్ధం అనివార్యం!

ట్రైలర్ టాక్ : యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ‘పతంగ్’.. ప్రేమ కోసం యుద్ధం అనివార్యం!

Published on Dec 15, 2025 12:02 PM IST

Patang

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘పతంగ్’ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాను ప్రణీత్ ప్రత్తిపాటి డైరెక్ట్ చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుండి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం యూత్‌ను ఆకట్టుకునే కంటెంట్‌తో కట్ చేశారు. ఇద్దరు ప్రాణస్నేహితులు ఒక అమ్మాయి ప్రేమ కోసం ఏం చేశారు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్ర టెంప్లేట్ పాతదే అయినా నేటితరం యూత్‌ను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో బోలెడు ఉండబోతున్నాయి. మంచి ఫ్రెండ్‌షిప్, లవ్, ఎమోషన్స్ తో పాటు ఆకట్టుకునే మ్యూజిక్ ఈ సినిమాకు బలంగా మారబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ఇక ఈ సినిమాలో పలువురు సీనియర్ యాక్టర్స్ కూడా కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అవుతుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యాకప్ చేస్తుండటంతో ఈ మూవీపై సినీ లవర్స్‌లో ఆసక్తి క్రియేట్ అయింది. ఇక క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు