‘రాకాస’ కి గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లేనా..?

‘రాకాస’ కి గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లేనా..?

Published on Mar 17, 2026 10:00 PM IST

raaa

నిహారిక కొణిదెల నిర్మించిన క్రేజీ ఫిల్మ్ “రాకాస” తాజాగా ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ‘శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్’ సంస్థ భారీ ధరకు దక్కించుకోవడం ఈ చిత్రంపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై పరిశ్రమలో మంచి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.
​ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. అధర్వణ భద్రకాళి పిక్చర్స్ మరియు ప్రత్యంగిర సినిమాస్ ఆధ్వర్యంలో అమెరికా, యూకే, యూరోప్ వంటి దేశాల్లో 350కి పైగా స్క్రీన్లలో సినిమాను ప్రదర్శించనున్నారు.

ఏప్రిల్ 2, 2026న ఓవర్సీస్ ప్రీమియర్లు పడనుండగా, ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలోకి రానుంది. డిజిటల్ రైట్స్ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, సంగీత ప్రియుల కోసం సారేగమ మ్యూజిక్ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.

​సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లోనటిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి వంటి హేమాహేమీలు నటిస్తున్న ఈ సినిమా రొమాన్స్, హ్యూమర్ మరియు ఫాంటసీ ఎలిమెంట్స్ కలయికతో రూపొందింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మరియు టీజర్‌కు లక్షలాది వ్యూస్ రావడంతో సోషల్ మీడియాలో ‘రాకాస’ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు