పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో శ్రీలీల మరియు రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా పవన్ నెక్స్ట్ ప్రాజెక్టుల గురించిన వార్తలు ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ తమిళ దర్శకుడు మోహన్ రాజా పవన్ కళ్యాణ్‌కు ఒక ఆసక్తికరమైన కథను వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని, అంతా అనుకున్నట్లు జరిగితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని సమాచారం. గతంలో చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తెరకెక్కించిన మోహన్ రాజా, బ్లాక్ బస్టర్ మూవీ ‘తని ఒరువన్’తో తన సత్తా చాటుకున్నారు.
అయితే, ఈ కొత్త ప్రాజెక్టుపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్ల ప్రకారం, పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ తన లైనప్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.


