‘వారణాసి’లో విలక్షణ నటుడు.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్..!

‘వారణాసి’లో విలక్షణ నటుడు.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్..!

Published on Dec 15, 2025 2:03 PM IST

varanasi

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో మహేష్, రాజమౌళి గ్లోబల్ స్థాయిలో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్తలు వచ్చినా, అభిమానులు ఫాలో అవుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఈ చిత్ర క్యాస్టింగ్‌పై ఇప్పుడు ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ విలక్షణ యాక్టర్ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తనదైన మ్యానరిజం, డైలాగ్ డెలివరీతో పాపులర్ అయిన ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎలాంటి పాత్రనైనా ఇట్టే చేయగల ప్రకాశ్ రాజ్ కోసం రాజమౌళి ఎలాంటి రోల్ రాశాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ నిజంగానే నటిస్తున్నాడా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎల్.నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు