ఫోటో మూమెంట్ : బర్త్ డే గర్ల్‌తో మెగా హీరోలు..!

ఫోటో మూమెంట్ : బర్త్ డే గర్ల్‌తో మెగా హీరోలు..!

Published on Dec 15, 2025 3:38 PM IST

saidurga

మెగా ఇంటి కోడలు, హీరో వరుణ్ తేజ్ భార్య, నటి లావణ్య త్రిపాఠి నేడు (డిసెంబర్ 15) పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది. అందంతో పాటు తనదైన యాక్టింగ్, క్యూట్‌నెస్‌తో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న లావణ్య, వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లాడింది. వారిద్దిరు నవంబర్ 1, 2023లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

ఇక 2025 సెప్టెంబర్ 10న వారికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న లావణ్య నేడు పుట్టినరోజు జరుపుకుంటుండటంతో మెగా హీరోలు సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ కలిసి ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు.

వారు కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా లావణ్య బర్త్‌డేను ఈ మెగా హీరోలు మరింత స్పెషల్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు