‘దాదా’.. కేవలం యాక్షన్ మాత్రమే కాదంటున్న గోపీచంద్ మలినేని

‘దాదా’.. కేవలం యాక్షన్ మాత్రమే కాదంటున్న గోపీచంద్ మలినేని

Published on Sep 16, 2026 8:02 AM IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న చిత్రం ‘దాదా’పై సినీ వర్గాల్లో గట్టి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని కొత్త అవతార్‌లో చూపించబోతున్నట్లు దర్శకుడు వెల్లడించాడు. 1980ల నాటి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, స్వాగ్ మరియు మేనరిజమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా, ‘నరసింహనాయుడు’, ‘సింహా’ చిత్రాల తరహాలోనే ఇందులో ప్రేక్షకులు ఊహించని బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని గోపీచంద్ తెలిపాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్‌గా, శరత్‌కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ఒకే ఒక్క డైలాగ్ గ్లింప్స్ సోషల్ మీడియాలో విశేష స్పందన తెచ్చుకుంది. నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు