మహేష్ బాబుపై కన్నేసిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్..?

మహేష్ బాబుపై కన్నేసిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్..?

Published on Sep 16, 2026 9:00 AM IST

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెలుగులో ఒక టాప్ హీరోతో భారీ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడనే వార్త జోరుగా హల్ చల్ చేస్తోంది. గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చర్చలు జరిపిన ఆయన, తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబును కలిసి ఒక కథ వినిపించినట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం మహేష్ బాబు పూర్తిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్‌పైనే దృష్టి పెట్టారు. ఆ సినిమా పూర్తయ్యే వరకు మహేష్ నెక్స్ట్ చిత్రాన్ని ఓకే చేసే అవకాశం లేదు. దీంతో భన్సాలీ-మహేష్ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు