స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. అందంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి ఆమె పలు ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆమె అందంపై ఓ డాక్టర్ కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశాడు. దీంతో అతడిపై రకుల్ మండిపడింది.
బొద్దుగా ఉన్న రకుల్ ఇప్పుడు చాలా సన్నగా అవ్వడానికి ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని సదరు డాక్టర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో అసలు అతడు నిజంగానే డాక్టరా అంటూ రకుల్ మండి పడింది. ఎవరి గురించైనా కామెంట్స్ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని.. ఓ యాక్టర్‌గా తనకు ప్రాచీన, ఆధునిక శాస్త్రాల గురించి తెలుసని.. ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం తప్పు కాదని.. అయితే, కేవలం ప్లాస్టిక్ సర్జరీతోనే బరువు తగ్గుతారనేది పూర్తిగా అవాస్తవం అని ఆమె తెలిపింది. కష్టపడి కూడా బరువును తగ్గించుకోవచ్చు అంటూ రకుల్ సదరు డాక్టర్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.
ఇలాంటి ఫ్రాడ్ డాక్టర్స్‌తో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది. ప్రస్తుతం రకుల్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.


