సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2026 నామినేషన్లను కమిటీ ప్రకటించింది. 2025లో విడుదలైన చిత్రాల పరిశీలన అనంతరం, తేజ సజ్జ – కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ ‘మిరాయ్’ ఏకంగా 11 కేటగిరీల్లో నామినేట్ అయి టాలీవుడ్‌లో టాప్‌లో నిలిచింది. రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు అవార్డుల రేసులోనూ ముందంజలో ఉంది.
ఇక బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల ‘సంక్రాంతికి వస్తున్నాం’ 10 కేటగిరీల్లో నామినేషన్లు సాధించి గట్టి పోటీనిస్తోంది. వీటితో పాటు నాగచైతన్య, సాయిపల్లవిల బ్లాక్‌బస్టర్ ‘తండేల్’ మరియు ‘కోర్ట్’ సినిమాలు చెరో 9 విభాగాల్లో నామినేట్ అయ్యాయి.


