హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్(James Cameroon) తెరకెక్కించిన ప్రెస్టీజియస్ ఫ్రాంచైజీ ‘అవతార్’(Avatar) నుంచి మూడో చిత్రంగా ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’(Avatar : Fire And Ash) నేడు(డిసెంబర్ 19) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సిరీస్‌లో వచ్చిన తొలి రెండు సినిమాలు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేశాయి. అయితే, ఇప్పుడు అవతార్ 3 కలెక్షన్స్ ఆ స్థాయిలో ఉండకపోవచ్చని సినీ సర్కిల్స్ టాక్.
చాలా చోట్ల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్ద క్రేజ్ కనిపించడం లేదు. తొలి రెండు పార్ట్‌లు ఉన్న క్రేజ్‌ను పోలిస్తే, ఈ మూడో పార్ట్ సినిమాకు ప్రేక్షకుల నుంచి చాలా తక్కువ రెస్పాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇలాంటి విజువల్ వండర్ సినిమాకు ఓపెనింగ్ డే కలెక్షన్స్(Opening Day Collections) సాలిడ్‌గా ఉంటాయి. తొలి రెండు పార్ట్ చిత్రాలకు అదే కనిపించింది. సాలిడ్ ఓపెనింగ్స్‌తో అవతార్ రెండు భాగాలు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టాయి.
కానీ, ఇప్పుడు మూడో భాగానికి ఓపెనింగ్ రోజున ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు మునుపటిలా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీనికి ఈ సినిమాకు వస్తున్న రివ్యూలు కూడా కారణంగా చెప్పాలి. విజువల్ పరంగా అద్భుతమైన ట్రీట్ ఉన్నప్పటికీ, కథలో బలం లేదని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. దీంతో మిగతా వారు ఈ సినిమాను లైట్ తీసుకుంటున్నారు.
తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు చూపిస్తున్న రెస్పాన్స్‌తో అవతార్ 3 ఓపెనింగ్ డే వసూళ్లకు(Avatar 3 Opening Day Collections) ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సరైన రెస్పాన్స్ లేకపోవడంతో, దీన్నే మిగతా చిత్రాలు క్యాష్ చేసుకుంటున్నాయి. బాక్సాఫీస్ దగ్గర అఖండ 2 తో పాటు ధురంధర్ చిత్రాలు ఈ స్పేస్‌ను వాడుకోవాలని భావిస్తున్నాయి. మొత్తానికి అవతార్ 3 చిత్రం జేమ్స్ కామెరూన్ అండ్ టీమ్ ఊహించినంత ఫలితాన్ని అందుకోలేకపోవచ్చని స్పష్టం అవుతుంది.


