‘స్వయంభు’ కోసం ఎన్టీఆర్ ఒప్పుకుంటారా ?

‘స్వయంభు’ కోసం ఎన్టీఆర్ ఒప్పుకుంటారా ?

Published on Dec 21, 2025 9:01 AM IST

Swayambhu

హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘స్వయంభు’. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పిరియాడికల్ మైథలాజిక్ చిత్రంగా ఈ మూవీ రాబోతుంది. ఐతే, ఈ చిత్ర కథా నేపథ్యాన్ని, పాత్రలను తన వాయిస్ తో తెలుగులో పరిచయం చేయడానికి టీమ్, ఎన్టీఆర్ ను అప్రోచ్ అవుతున్నారని తెలుస్తోంది. హిందీలో అజయ్ దేవగణ్ ను ట్రై చేస్తున్నారట. మరి నిఖిల్ కోసం ఎన్టీఆర్, అజయ్ దేవగణ్ తమ వాయిస్ లను ఇవ్వడానికి ఒప్పుకుంటారా ? లేదా ? అనేది చూడాలి.

కాగా ఈ సినిమా ఫిబ్రవరి 13, 2026న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పిక్సెల్ స్టూడియోస్ ఆధ్వర్యంలో భువన్ మరియు శ్రీకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు, నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు