భీమవరంలోని జేపీ రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన ‘గోయజ్’ (Goyaz) సిల్వర్ జ్యువెలరీ షోరూమ్‌ను సినీ నటి, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె షోరూమ్‌లోని ఆభరణాలను పరిశీలించి సందడి చేశారు.
ప్రారంభోత్సవం అనంతరం నేహా శెట్టి మాట్లాడుతూ.. తనకు వడ్డాణం అంటే చాలా ఇష్టమని, ఇక్కడ ఉన్న కలెక్షన్స్ చూస్తుంటే అన్నీ తీసేసుకోవాలనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. గోయజ్ సంస్థకు ఇది 20వ షోరూమ్ కాగా, ఇందులో తాను మూడో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. యువతులు అందంగా కనిపించేందుకు ఇక్కడి ఆభరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 19 స్టోర్లతో విస్తరించి, భీమవరంలో 20వ స్టోర్ ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి మాట్లాడుతూ.. అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయజ్ అని, ఇక్కడ నాణ్యమైన వెండి ఆభరణాలు అందుబాటులో ఉంటాయని వివరించారు.


