‘విశ్వంభర’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

‘విశ్వంభర’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Jan 24, 2026 8:11 AM IST

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవీ నటించిన తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” భారీ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత తన నుంచి రానున్న అవైటెడ్ చిత్రమే ‘విశ్వంభర’. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ నిజానికి ముందే రిలీజ్ కావాల్సిన సినిమా కానీ ఆలస్యం అయ్యింది.

మేకర్స్ కంటెంట్ విజువల్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యారు. అందుకే ఈ ఆలస్యం. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. దీని ప్రకారం ‘విశ్వంభర’ నుంచి మేకర్స్ నెక్స్ట్ మరో సాలిడ్ ట్రీట్ ని అందించనున్నారని తెలుస్తుంది. మరో వీడియో టీజర్ ని అద్భుతమైన విజువల్స్ తో కూడిన కట్ ని రిలీజ్ చేస్తారని వినిపిస్తుంది.

దీనితో డెఫినెట్ గా ఆడియెన్స్ లో మరింత అంచనాలు అందుకుంటుంది అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారట. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మెగాస్టార్ ఫాంటసీ సినిమాలకి సాలిడ్ రీచ్ ఉంటుంది. మరి ఈ సినిమా వాటిని అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు