మొత్తానికి ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న రోషన్ ‘ఛాంపియన్’

మొత్తానికి ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న రోషన్ ‘ఛాంపియన్’

Published on Jan 24, 2026 10:01 AM IST

Champion

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ మేక హీరోగా అనశ్వర రాజన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన స్పోర్ట్స్, పీరియాడిక్ చిత్రమే ‘ఛాంపియన్’ (Champion). మంచి బజ్ నడుమ వచ్చిన ఈ సినిమా డీసెంట్ వసూళ్లు అందుకొని విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక థియేటర్స్ తర్వాత అంతా ఓటిటి రిలీజ్ కోసం చూస్తుండగా ఫైనల్ గా దీనికి డేట్ వచ్చేసింది.

ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ జనవరి 29 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సో ఛాంపియన్ (Champion) సినిమా అప్పుడు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇందులో హిందీ మినహా అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమా రానున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా ప్రియాంక దత్, జీకే మోహన్, జెమినీ కిరణ్ లు నిర్మాణం వహించారు. అలాగే వైజయంతి బ్యానర్ పై ఈ సినిమా విడుదల అయ్యింది.

తాజా వార్తలు